News June 22, 2024
మెదక్: మహిళా కడుపు నుంచి 7.50 కిలోల కణతి తొలగింపు
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అరుదైన చికిత్స నిర్వహించారు. పట్టణానికి చెందిన పుట్టి యశోద అనే మహిళ గత ఆరు నెలలుగా కడుపులో కణతితో బాధపడుతుంది. స్థానికంగా ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకోగా అనస్తీషియా డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ హేమరాజ్ సింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆమె కడుపులో నుండి 7.50 కిలోల కణతి తొలగించారు.
Similar News
News November 7, 2024
MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. అందరి దృష్టి వారిపైనే..
కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
News November 7, 2024
సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
బ్యూటీ పార్లర్ ఉచిత శిక్షణ కోసం సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ బుధవారం తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు అర్హులని చెప్పారు. బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు.
News November 7, 2024
సర్వేకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలి: రాజనర్సింహ
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ఇండ్ల వద్దకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఆందోల్- జోగిపేట మున్సిపాలిటీ పరిది పోచమ్మగల్లి, ముదిరాజ్ గల్లిలో సర్వేను మంత్రి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వేకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సర్వేలో సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.