News December 28, 2024
మెదక్: మాజీ ప్రధానికి మంత్రి పొన్నం నివాళి
ఢిల్లీలో భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సంస్కరణలు అమలు చేసి దేశ ఆర్థిక అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు. జీవితంలో ఎన్నో అత్యున్నత పదవులు చేపట్టిన ఆయన నిరాడంబరతకు ఆదర్శం అన్నారు.
Similar News
News December 29, 2024
మెదక్ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు
మెదక్ జిల్లాలో ఆదివారం ఉ.గం.8.30 వరకు ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. చిలప్ చెడ్ 16.3, టేక్మాల్, కౌడిపల్లి 16.8, టేక్మాల్ 17.0, వెల్దుర్తి 17.1, కుల్చారం, పాపన్నపేట, పెద్దశంకరంపేట 17.4, అల్లాదుర్గ్ 17.5, శివ్వంపేట్ 17.6, మనోహరాబాద్, నార్సింగి 18.0, నర్సాపూర్ 18.1, చేగుంట 18.2, తూప్రాన్ 18.3, రామాయంపేట 18.4, రేగోడ్ 18.6, మెదక్, హవేళిఘనపూర్ 18.9, చిన్న శంకరంపేట19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది.
News December 29, 2024
రేవంత్ రెడ్డి చేతగాని పాలన విద్యార్థులకు శాపంగా: హరీష్ రావు
విద్యాశాఖ మంత్రిగా ఉండి వారి భవిష్యత్తును CM రేవంత్ రెడ్డి ప్రశ్నార్థకం చేస్తున్నారని, సీఎం చేతకాని పాలన విద్యార్థులకు శాపంగా మారిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు. విష ఆహారం తిని వాంకిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరువక ముందే నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో విష ఆహారం తిని 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావడం CM పాలన వైఫల్యానికి నిదర్శనం అన్నారు.
News December 29, 2024
మెదక్: ‘నా చావుకు తల్లిదండ్రులే కారణం’
మెదక్ మం. జానకంపల్లికి చెందిన మల్లయ్య కుమార్తె శ్రావణి(17) మెదక్ కస్తూర్బా పాఠశాలలో టెన్త్ చదువుతుంది. ఈనెల 22న బోనాల పండుగకు ఇంటికొచ్చిన శ్రావణి శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ‘నా చావుకు తల్లిదండ్రులే కారణం’ అని లేటర్ రాసి ఉరేసుకుంది. తన చెల్లి మృతికి కారణమైన తండ్రి మల్లయ్య, పినతల్లిపై చర్యలు తీసుకోవాలని స్రవంతి, ఆకృతి ఫిర్యాదు చేశారు. మల్లయ్య మొదటి భార్య చనిపోగా జ్యోతిని 2వ పెళ్లి చేసుకున్నాడు.