News April 18, 2024
మెదక్: ముహూర్త బలంతో అభ్యర్థులు ముందుకు..!

పార్లమెంట్ ఎన్నికల మొదటి ఘట్టం నేటితో ప్రారంభం అవ్వడంతో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ముహూర్త బలాన్ని నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. మెదక్‌లో నేడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ వేస్తుండగా ఆయన అయోధ్య వెళ్లి రాముని చెంత నామినేషన్ పత్రాలు పెట్టి టైం ఫిక్స్ చేసుకున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముహూర్త బలం ఫిక్స్ చేసుకొని నామినేషన్ వేస్తున్నారు.
Similar News
News November 3, 2025
మెదక్: చేవెళ్ల ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి

చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. పేషెంట్ల కండీషన్‌ను డాక్టర్లు మంత్రికి వివరించారు. ఒక్కరికి మాత్రమే హెడ్ ఇంజురీ కాగా, ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. అందరికీ మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. వైద్య ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. బాధితులతో మాట్లాడిన మంత్రి దామోదర్ రాజనర్సింహ ధైర్యం చెప్పారు.
News November 3, 2025
మెదక్: రేపటి నుంచి పోలీస్ యాక్ట్ అమలు

ఈ నెల 3 నుంచి 30 వరకు మెదక్ జిల్లా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ.శ్రీనివాస రావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఏవిధమైన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు.
News November 3, 2025
మెదక్: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కాలినడకన వెళ్తున్న వ్యక్తిని ద్విచక్ర వాహనదారుడు ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడగా ఆసుపత్రికి తరలించారు. కాలినడకన వెళ్తున్న చేగుంటకు చెందిన కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.


