News April 18, 2024

మెదక్‌: ముహూర్త బలంతో అభ్యర్థులు ముందుకు..!

image

పార్లమెంట్ ఎన్నికల మొదటి ఘట్టం నేటితో ప్రారంభం అవ్వడంతో అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి ముహూర్త బలాన్ని నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. మెదక్‌లో నేడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ వేస్తుండగా ఆయన అయోధ్య వెళ్లి రాముని చెంత నామినేషన్ పత్రాలు పెట్టి టైం ఫిక్స్ చేసుకున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముహూర్త బలం ఫిక్స్ చేసుకొని నామినేషన్ వేస్తున్నారు.

Similar News

News September 14, 2024

బేస్ బాల్ క్రీడల్లో సత్తా చాటిన సిద్దిపేట జిల్లా జట్టు

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న 5వ తెలంగాణ స్టేట్ జూనియర్ ఇంటర్ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ క్రీడల్లో సిద్దిపేట జిల్లా జట్టు దూసుకుపోతున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిమ్మ రంగారెడ్డి, మధు యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్ గౌడ్ తెలిపారు. నిర్మల్ జట్టుపై 1:7 తేడాతో, మేడ్చల్ జట్టుపై 1:3 తేడాతో సిద్దిపేట జట్టు గెలుపొంది ఫ్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నట్లు వివరించారు.

News September 14, 2024

అలజడి సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచి వేయండి: మంత్రి పొన్నం

image

ఐక్యతకు హైదరాబాద్‌ ప్రతీకగా నిలుస్తోందని, ఎక్కడైనా అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గవిభేదాలు సృష్టిస్తూ సోషల్‌ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచి వేయాలన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్‌, సీపీతో కలిసి మాట్లాడారు.

News September 14, 2024

నర్సాపూర్: చెరువులో ట్రాక్టర్ కడగడానికి వెళ్లి యువకుడు మృతి

image

వినాయక నిమజ్జనం కోసం ట్రాక్టర్ కడగడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నర్సాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమజ్జనం వేడుకల సందర్భంగా మండలంలోని ఆవంచ గ్రామానికి చెందిన గంట శ్రీను తన స్నేహితులతో కలిసి చెరువు వద్దకు ట్రాక్టర్ కడగడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.