News November 11, 2024
మెదక్: మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నివాళులు
స్వాతంత్ర సమరయోధులు, తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మెదక్ సమీకృత కలెక్టరేట్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు ఎల్లయ్య, శ్రీనివాసరావు, మాధవి, నాగరాజు గౌడ్ తదితరులున్నారు.
Similar News
News December 8, 2024
గజ్వేల్: నేడు కేసీఆర్ అధ్యక్షతన BRSLP సమావేశం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం జరగనున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
News December 7, 2024
రేవంత్ రెడ్డి ఏడాది పాలన.. ఉమ్మడి మెదక్ REPORT
రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మెదక్ మెడికల్ కళాశాల, ఆందోల్ నర్సింగ్ కళాశాల మంజూరు, జోగుపేట ఆసుపత్రి 150 పడకలకు పెంపు, పటాన్చెరు వరకు రూ.1700 కోట్లతో మెట్రో విస్తరణ, తిమ్మాపూర్‌లో 1000మందికి ఉపాధి లభించే కోకాకోలా కంపెనీ ప్రారంభం, సహా పలు పనులు చేపట్టారు. మీ కామెంట్?
News December 7, 2024
MDK: ఇన్ఛార్జ్ మంత్రి ఏడాది పాలన.. మీ కామెంట్?
తూర్పు వరంగల్ MLA కొండా సురేఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా, ఆమెకు CM రేవంత్ దేవాదాయ & అటవీ శాఖలు కేటాయించడంతో పాటు MDK ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రిగా MDKలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీ బస్సు పథకం ప్రారంభం, రూ.500 గ్యాస్, రుణమాఫీ, జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మీ కామెంట్?