News April 22, 2025
మెదక్: యువతి అదృశ్యం.. కేసు నమోదు

ఆసుపత్రికి వెళ్లిన యువతి కనిపించకుండా పోయిన ఘటన శివంపేట మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి (18) ఓ పరిశ్రమలో కూలీగా పనిచేస్తుంది. ఈనెల 19న తూప్రాన్ ఆసుపత్రికి వైద్యం కోసం వెళ్లి తిరిగి రాలేదు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 22, 2025
WNP: జిల్లాలో TODAY… TOP NEWS

✔️WNP: రాజీవ్ యువ వికాసానికి 3,060 దరఖాస్తులు. ✔️WNP జిల్లాలో మొదటి సంవత్సరంలో 59.17%, 16th స్టేట్ ర్యాంక్, ద్వితీయ సంవత్సరంలో 66.89%, 24th స్టేట్ ర్యాంక్. ✔️రైతుల ప్రయోజనం కోసమే భూభారతి -కలెక్టర్. ✔️కేసీఆర్ సభ… భారీగా జన సమీకరణకు నేతల ప్లాన్. ✔️అమరచింతలో గుడికి 300 సంవత్సరాల చరిత్ర. ✔️సుమశ్రిని అభినందించిన సజ్జనార్. ✔️100 గ్రాముల వడ్లకు… 67 గ్రాముల బియ్యం.
News April 22, 2025
వనపర్తి: నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయండి: కలెక్టర్

సన్న రకం, దొడ్డు రకం వడ్లు కొనుగోలు కేంద్రాలు వేరు వేరుగా ఉండాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ఐ.డి. ఒ. సి సమావేశ మందిరంలో ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, ఏపీయం, సీసీలతో కొనుగోలు కేంద్రాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. నిబంధనల ప్రకారం నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు.
News April 22, 2025
రేపు 39 మండలాల్లో తీవ్ర వడగాలులు

AP: రేపు రాష్ట్రంలోని 39 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం(7), విజయనగరం(17), మన్యం(13), అల్లూరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ నంద్యాల జిల్లాలోని దోర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. సిద్ధవటం-43.8, కర్నూలు-43.5, వతలూరు-42.9, పెద్ద దోర్నాలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.