News March 30, 2024

మెదక్: రఘునందన్ రావుపై ఈసీకి ఫిర్యాదు

image

బీఆర్ఎస్ నేతలపై మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌కు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. హైదరబాద్‌లోని ఈసీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రఘునందన్ రావు పై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. పరుష పదజాలంతో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలిపారు. కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి ఉన్నారు.

Similar News

News February 9, 2026

తూప్రాన్: పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఎన్నికల పరిశీలకులు

image

తూప్రాన్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు మంద మకరంద్ సందర్శించారు. ఓటర్లకు కల్పిస్తున్న ప్రాథమిక సదుపాయాలు, తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంప్ సౌకర్యం, క్యూలైన్ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా, క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.

News February 9, 2026

మెదక్: మున్సిపల్ ఎన్నికల పక్రియ సాఫీగా జరగాలి: కలెక్టర్

image

మున్సిపల్ ఎన్నికల పక్రియ సాఫీగా జరగాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ఎన్నికల అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో జరుగనున్న నాలుగు మున్సిపాలిటీ ఎన్నికలు సాఫీగా జరగాలన్నారు. ఏవైనా ఎన్నికల నిర్వహణ పనులు పూర్తి కాకపోతే రేపు ఉదయం 9 గంటల వరకు పూర్తి చేయాలన్నారు.

News February 9, 2026

మెదక్: సైలెన్స్ పీరియడ్ ప్రచారం వద్దు: ఎస్పీ

image

మెదక్ జిల్లాలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసింది. సైలెన్స్ పీరియడ్ సమయంలో ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, మైక్‌లు, లౌడ్ స్పీకర్లు, ప్రచార వాహనాలు, పోస్టర్లు, బ్యానర్లు ఉండరాదని మెదక్ ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పేర్కొన్నారు.