News January 27, 2025
మెదక్: రూ.30 వేలు లంచం.. ఏసీబీకి దొరికాడు..!

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ సర్కిల్ అసిస్టెంట్ ఇంజినీర్ సీహెచ్.కృష్ణ <<15280332>>లంచం తీసుకుంటూ<<>> ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. వివరాలు.. ఎల్‌టీ కేటగిరీ-3 కింద 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. ముందు రూ.10 వేలు తీసుకోగా ఈరోజు మిగతా రూ.20 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. కృష్ణను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.
Similar News
News December 5, 2025
VZM: పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. అంతలోనే ఆత్మహత్య.!

పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం విజయనగరంలోని దాసన్నపేటలో జరిగింది. కోరాడ వీరేంద్ర (25) సింహాచలంలో నేడు పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తాలు లేకున్నా పెళ్లి చేసుకోవాలని ప్రేమించిన యువతి ఒత్తిడి చేయడమే ఆత్మహత్యకు ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు చెప్పినా,వీరేంద్ర ఎందుకు ఇలా చేశాడో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 5, 2025
సీఎం ఓయూ పర్యటన వాయిదా

TG: ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న ఓయూకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. ఎల్లుండికి బదులుగా ఈ నెల 10న సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు.
News December 5, 2025
ఇసుక త్రవ్వకాలు రవాణా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ విధానం ద్వారా ఇసుక త్రవ్వకాలు, రవాణా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి ప్రజలకు ఇసుక కొరత లేకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఇసుక నిలువలు, ఇప్పటివరకు నిర్వహించిన ఇసుక లావాదేవీలు, ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థలపై ఆయన అధికారులతో చర్చించారు.


