News January 27, 2025

మెదక్: రూ.30 వేలు లంచం.. ఏసీబీకి దొరికాడు..!

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ సర్కిల్ అసిస్టెంట్ ఇంజినీర్ సీహెచ్.కృష్ణ <<15280332>>లంచం తీసుకుంటూ<<>> ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. వివరాలు.. ఎల్‌టీ కేటగిరీ-3 కింద 63 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.30 వేలు డబ్బులు డిమాండ్ చేశాడు. ముందు రూ.10 వేలు తీసుకోగా ఈరోజు మిగతా రూ.20 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులు పట్టుకున్నారు. కృష్ణను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

Similar News

News February 14, 2025

విశ్వక్‌సేన్ ‘లైలా’ పబ్లిక్ టాక్

image

విడుదలకు ముందే రాజకీయ వివాదాలతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన ‘లైలా’ సినిమా ప్రీమియర్ షోలు USలో ప్రారంభమయ్యాయి. సినిమా గురించి నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ అదరగొట్టారని, సినిమా అంతా వన్ మ్యాన్ షో అని ప్రశంసిస్తున్నారు. అయితే స్టోరీ ఔట్‌డేటెడ్ అని, ఇంట్రెస్టింగ్ సీన్లు లేవని కొందరు పెదవి విరుస్తున్నారు. పూర్తి రివ్యూ, రేటింగ్ మరికొన్ని గంటల్లో..

News February 14, 2025

భద్రాద్రి: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు

image

ఇతర రాష్ట్రాల్లో కోళ్లకు వైరస్ సోకుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా భద్రాద్రి జిల్లాకు ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి కోళ్ల దిగుమతి అరికట్టేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అశ్వరావుపేట, దమ్మపేట మండలం అల్లిపల్లి, చర్ల మండలం తేగడ వద్ద పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.

News February 14, 2025

ఖమ్మం ప్రధాన రహదారులు.. రక్తసిక్తం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మినీ మేడారం జాతర, పలు మండలాల్లో ఆలయాల మహోత్సవాలతో గురువారం ఖమ్మం జిల్లాలో జనాల తాకిడి పెరిగింది. దీంతో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. దాదాపు పదుల సంఖ్యలో దుర్మరణం చెందారు. అలాగే పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అకాల ప్రమాదాలతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!