News February 17, 2025
మెదక్: రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు

నూతనంగా నియామకమైన పోలీస్ సిబ్బందికి రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలలో పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు.
Similar News
News December 17, 2025
నర్సాపూర్ ఎమ్మెల్యే స్వగ్రామంలో కాంగ్రెస్ విజయం

శివంపేట మండలంలో గోమారం సర్పంచిగా కుమ్మరి హిమవతి ఆంజనేయులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి హిమవతి సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, గోమారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వగ్రామం.
News December 17, 2025
మెదక్: మండలాల వారీగా పోలింగ్ శాతం

మెదక్ జిల్లాలో మూడో విడత 7 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా 90.68 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. ఒంటిగంట తర్వాత నమోదైన ఓటింగ్ శాతం.. చిలపిచెడు మండలంలో 90.02, కౌడిపల్లి 90.80, కుల్చారం 89.20, మాసాయిపేట 88.90, నర్సాపూర్ 93.38, శివంపేట 92.57, వెల్దుర్తి 87.62 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.
News December 17, 2025
మెదక్ జిల్లాలో 90.68% పోలింగ్

మెదక్ జిల్లాలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో 90.68 % పోలింగ్ నమోదైంది. మొదటి, రెండవ విడత కంటే మూడవ విడత ఓటింగ్ పెరిగింది. ఈసారి నర్సాపూర్ మండలలో ఎక్కువగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చిలప్ చెడ్ – 90.02%,
కౌడిపల్లి – 90.80%,
కుల్చారం – 89.20%,
మసాయిపేట – 88.90 %,
నర్సాపూర్ – 93.38%,
శివంపేట – 92.57%,
వెల్దుర్తి – 87.62 % నమోదైంది.


