News August 19, 2024
మెదక్: రేపటి నుంచి ‘ఆరోగ్య మిత్ర’ల సమ్మె
రాజీవ్ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు రేపటి నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 43 మంది సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 6 నుంచి మంత్రి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, సచివాలయ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ (డిపిఓ)గా క్యాడర్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News September 15, 2024
దుబ్బాక: చెరువులో పడి బాలుడి మృతి
దుబ్బాక మండలం అప్పనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లి మండలం గౌరాయపల్లికి చెందిన బండి నవీన పిల్లలతో కలిసి అప్పనపల్లి తల్లిగారింటికి వచ్చింది. తల్లి రేణుక, మరదలు కావ్య, కుమారుడు సాయి (7)తో కలిసి నవీన చెరువు వద్దకు దుస్తులు ఉతికేందుకు వెళ్లారు. చెరువు కట్టపై ఆడుకుంటున్న సాయి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
News September 15, 2024
MDK: సమన్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం: మంత్రి
అన్ని వర్గాలకు సమన్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నూతన టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి, సీనియర్ నాయకులు తాడూరి శ్రీనివాస్ గౌడ్, సిద్దిపేట ఇన్‌ఛార్జ్ పూజల హరికృష్ణతో కలిసి ఆయన గాంధీభవన్‌కు బయలుదేరారు.
News September 15, 2024
అమీన్ పూర్: ఆన్ లైన్ టాస్క్ పేరుతో రూ.4.6 లక్షల స్వాహా
ఉద్యోగం చేసుకుంటూ ఆన్ లైన్ ఇచ్చే టాస్క్‌లో పూర్తి చేస్తే కమిషన్ వస్తుందంటూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నుంచి సైబర్ మోసగాడు రూ.4.6 లక్షల కాజేశాడు. సిఐ నాగరాజు కథనం ప్రకారం.. కృష్ణారెడ్డి పేటలో నివాసం ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు మార్చి 18న మెసేజ్ వచ్చింది. ఆన్‌లైన్‌లో నగదు చెల్లిస్తే టాస్కులు ఇస్తామని ఆశ చూపారు. దఫా దఫాలుగా డబ్బులు చెల్లించాడు. కమిషన్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.