News April 4, 2024
మెదక్: రైతు కేంద్రంగా రాజకీయం..!

ఎన్నికల్లో రైతులను ఆకర్షించే పనిలో అన్ని పార్టీలు నిమగ్నమయ్యాయి. రైతులను ప్రసన్నం చేసుకుంటేనే సీటు గెలుస్తామని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మెదక్లో రైతు కేంద్రంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన రైతులు, వ్యవసాయ కూలీలను పార్టీలు టార్గెట్గా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం కరువుకు కారణం మీరంటే మీరేనని దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
Similar News
News December 8, 2025
మెదక్: రెండో విడతలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏడు సర్పంచి స్థానాలు, 254 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 8 మండలాల్లో 142 సర్పంచి, 1,035 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి పదవులు ఏకగ్రీవమైన వాటిలో వెల్దుర్తి మండలం షౌకత్ పల్లి, నగరం, బస్వాపూర్, మెదక్ మండలం మల్కాపూర్ తండా, చిన్న శంకరంపేట మండలం మాందాపూర్ తండా, గవలపల్లి తండా, సంగాయపల్లి ఏకగ్రీవం అయ్యియి.
News December 8, 2025
MDK: నాడు భర్త సర్పంచ్.. నేడు భార్య ఏకగ్రీవ సర్పంచ్

టేక్మాల్ మండలం చల్లపల్లిలో ఎల్లంపల్లి సంగీతను సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామానికి చెందిన ఎల్లంపల్లి గోపాల్ 2018 సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసి 11 ఓట్లతో గెలిచాడు. 5 ఏళ్లు గోపాల్ గ్రామంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తించిన గ్రామ ప్రజలు అతని భార్య ఎల్లంపల్లి సంగీతను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికలలో నామినేషన్ వేయించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
News December 8, 2025
MDK: పల్లెల్లో పోరు.. సర్పంచ్ పీఠం ఎవరికో!

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రసవత్తరంగా మారాయి. పల్లెల్లో అన్నదమ్ముల్లాగా ఉన్న వారు ఎన్నికలు రాగానే ఆపోజిట్ అభ్యర్థులుగా మారుతున్నారు. ఎన్నడో గ్రామాలను వదిలి వెళ్లిన వారు సైతం గ్రామంలోకి వచ్చి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నికల దావత్లతో పల్లెల్లో జోరు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో సర్పంచ్ పీఠం ఎవరికి దక్కునో.. మరీ మీ ప్రాంతంలో!


