News August 26, 2024

మెదక్: రైతు రుణమాఫీకి ప్రత్యేక యాప్

image

జిల్లావ్యాప్తంగా రుణమాఫీ కానీ రైతుల సమస్యల కొరకు ప్రభుత్వం “రైతు భరోసా” పేరిట ప్రత్యేక యాప్ రూపొందించింది. ఈ యాప్ అమలు గురించి అధికారులకు ఈనెల 27న ఉన్నతాధికారులు అవగాహన కల్పించనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రుణమాఫీ కాలేదంటూ మండల వ్యవసాయ అధికారులకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ యాప్ రాకతో రైతుల సమస్యలు తీరనున్నాయని పలువులు అంటున్నారు.

Similar News

News September 13, 2024

MDK: హత్యాయత్నం కేసులో నిందితునికి 7ఏళ్లు జైలు

image

హాత్యాయత్నం కేసులో నేరస్థుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష రూ.5వేల జరిమానా విధిస్తూ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. సదాశివపేట మండలం కోనాపూర్‌కు చెందిన యాదయ్య పక్కన స్థలంలో వీరయ్య పగిలిన కల్లు సీసాలు వేసేవాడు. ఇదేంటని అడిగినందుకు యాదయ్యపై వీరయ్య కత్తితో హత్యాయత్నం చేశారు. నేరం రుజువు కావడంతో వీరయ్యకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

News September 13, 2024

మెదక్: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

ఈనెల 28 నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద అన్నారు. లోక్ అదాలత్‌ లో ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. మెదక్ జిల్లా కోర్టు ఆవరణలో గురువారం వివిధ వర్గాలతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో న్యాయమూర్తులు పాల్గొన్నారు.

News September 12, 2024

అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నేత సీతారాం ఏచూరి: మంత్రి పొన్నం

image

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అకాల మరణం తనని తీవ్ర ధ్రిగ్బాంతికి గురిచేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సీతారాం ఏచూరి కింది స్థాయి నుండి జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నాయకుడు అని, ప్రజల పక్షాన ఎన్నో ఉద్యమాల్లో పోరాడారని గుర్తు చేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ వారికి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.