News May 3, 2024
మెదక్: రోడ్డుపై వడ్ల కుప్పను ఢీకొని ఒకరు మృతి

మనోహరాబాద్ మండలం పాలాట వద్ద రాత్రి వడ్ల కుప్పని ఢీకొని సుంచు సత్యనారాయణ(45) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. పోతారం గ్రామానికి చెందిన సత్యనారాయణ రాత్రి ద్విచక్రవాహనంపై పాలాట మీదుగా లింగారెడ్డిపేటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పాలాట వద్ద రోడ్డుపై పోసిన వడ్ల కుప్పను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News November 12, 2025
మెదక్: ‘ఆన్లైన్లో సభ్యత్వ నమోదు చేసుకోండి’

జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సభ్యత్వ నమోదు కోసం ఆన్లైన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం టీఎన్జీవో భవన్లో తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల జిల్లా ఫోరం సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్ను జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్తో కలిసి ప్రారంభించారు. తొలి సభ్యత్వాన్ని అందజేశారు.
News November 11, 2025
మెదక్: ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జీవితం ఆదర్శనీయమని అదనపు కలెక్టర్ నగేష్ కొనియాడారు. కలెక్టరేట్లో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆజాద్ జయంతి వేడుక నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, అధికారులు, సిబ్బంది ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆజాద్ జయంతిని జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు నగేష్ తెలిపారు.
News November 11, 2025
మెదక్: సమస్యల సత్వర పరిష్కారానికి… లోక్ అదాలత్: ఎస్పీ

ఈ నెల 15న జరగనున్న ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ. శ్రీనివాస రావు కోరారు. త్వరగా, తక్కువ ఖర్చుతో, ఇరుపక్షాల సమ్మతితో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం ఈ లోక్ అదాలత్లో లభిస్తుందని ఎస్పీ తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్, ఆస్తి విభజన వంటి రాజీపడే అవకాశమున్న కేసులను పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని ఆయన సూచించారు.


