News April 16, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

image

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచుపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రేగోడ్ మండలంలోని పట్టెపొలం తండాకు చెందిన లావుడియా సక్రీ బాయి, సుభాష్ బైక్‌పై వెళ్తున్నారు. నిజాంపేట్ మండలం బాచుపల్లి శివారులో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 17, 2025

HYD: దుర్గా మాత విగ్రహ ప్రతిష్ఠకు ఆన్‌లైన్ నమోదు

image

సైబరాబాద్‌లో దుర్గామాత నవరాత్రి వేడుకలకు విగ్రహ ప్రతిష్ఠకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పోలీసులు సూచించారు. భక్తులు, యువకులు, మండపాల నిర్వాహకులు https://policeportal.tspolice.gov.in/index.htm వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుంటే అధికారులు పరిశీలించి అనుమతులు ఇస్తారని తెలిపారు. అనుమతులు పొందిన తర్వాతే మండపాలు ఏర్పాటు చేయాలన్నారు.

News September 17, 2025

ASF: రక్తదానం చేసి ప్రాణదాతలు కండి: బీజేపీ

image

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో రక్తం అవసరం పడుతుందన్నారు. జీవితంలో ఒక్కసారి అయినా రక్తదానం చేయాలని అన్నారు.

News September 17, 2025

ASF: నిజాం నిరంకుశత్వంపై సాధించిన విజయమే తెలంగాణ విమోచనం: బీజేపీ

image

తెలంగాణ ప్రజలకు అష్ట కష్టాలు పెట్టిన నిజాం, రజాకారుల దాష్టికాల నుంచి తెలంగాణ విమోచనం జరిగిందని BJP జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. విమోచన దినం సందర్భంగా ఆసిఫాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గీతాలాపన చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. చాకలి ఐలమ్మ వంటి ఎంతో మంది వీరమాతలు రజాకార్లపై తిరగబడి సాధించిన తెలంగాణ ఇది అన్నారు.