News April 16, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

image

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచుపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రేగోడ్ మండలంలోని పట్టెపొలం తండాకు చెందిన లావుడియా సక్రీ బాయి, సుభాష్ బైక్‌పై వెళ్తున్నారు. నిజాంపేట్ మండలం బాచుపల్లి శివారులో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News April 19, 2025

శ్రీనగర్ ASPగా కర్నూల్ వాసి.!

image

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌‌లోని శ్రీనగర్ ASPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ ASPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

News April 19, 2025

‘జాట్‌’లో ఆ సీన్ తొలగింపు

image

జాట్‌లో ఓ సీన్ తమ మనోభావాల్ని దెబ్బ తీసేలా ఉందంటూ క్రైస్తవులు ఆరోపించడంతో ఆ సన్నివేశాన్ని తొలగిస్తున్నట్లు మూవీ టీమ్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఎవరి మనోభావాల్ని గాయపరచడం మా ఉద్దేశం కాదు. ఆ సన్నివేశం పట్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమించాలని కోరుతున్నాం’ అని అందులో పేర్కొన్నారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన జాట్‌ను తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించారు.

News April 19, 2025

ములుగు జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

◆ములుగు: పేదవాడి కన్నీరు తుడవడానికి భూభారతి: పొంగులేటి ◆ములుగు ఆసుపత్రిలో శిశువు మృతి.. కుటుంబీకుల ఆందోళన ◆ఏటూరునాగారం: అడవిలో సిగరెట్ తాగిన వ్యక్తికి జరిమానా ◆బిఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వోలను వాడుకొని తొలగించింది: సీతక్క ◆కాకతీయుల పాలనకు నిదర్శనం రామప్ప ◆వెంకటాపూర్: దేశానికి వెన్నుముక రైతు: మంత్రి కొండా సురేఖ

error: Content is protected !!