News March 4, 2025
మెదక్: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా పీసీపీఎన్ డీటీ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆడపిల్లల బ్రాణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లావ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చారు.
Similar News
News November 20, 2025
మెదక్: ‘కల్లుగీత కార్మికులకు హామీలు నెరవేర్చాలి’

కల్లుగీత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ డిమాండ్ చేశారు. మెదక్లో గురువారం కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ఆరవ మహాసభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు. గౌడ కులస్తులకు బడ్జెట్లో రూ.5000 కోట్లు కేటాయించాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News November 20, 2025
నార్సింగి: పల్లె ప్రకృతి వనమా.. డంపింగ్ యార్డా?

పచ్చని చెట్లు పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కానీ నార్సింగి మం. సంకాపూర్ పల్లె ప్రకృతి వనంలో పూర్తిగా చెత్త వేస్తూ అధ్వానంగా మారుస్తున్నారు. ప్రకృతి వనం ప్రక్కనే నివాస గృహాలు ఉండడంతో చెత్త వల్ల పాములు విపరీతంగా వస్తున్నాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు గ్రామస్థులు కోరుతున్నారు.
News November 20, 2025
MDK: చుక్కా రామయ్యకు శతవసంత శుభాకాంక్షలు: హరీష్ రావు

ప్రముఖ విద్యావేత్త ఐఐటీ రామయ్యగా పేరుపొందిన చుక్కా రామయ్య వందవ ఏట అడుగు పెట్టిన సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు శతవసంత శుభాకాంక్షలు తెలిపారు. తరగతి గదిలో ఐఐటీ పాఠాలు మాత్రమే కాదు, తెలంగాణ ఉద్యమానికి మేథో దిక్సూచి అయిన మహోన్నతుడు ఆయన అని అన్నారు. అక్షరం ఆయుధం, నిరాడంబరత ప్రతిరూపం, క్రమశిక్షణకు మారుపేరు అయిన రామయ్య దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నానన్నారు.


