News April 10, 2025

మెదక్: వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్

image

శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామానికి చెందిన వినోద(34)కు కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన చెల్లి ప్రవీణ్ కుమార్‌తో వివాహమైంది. భర్త ప్రవీణ్, అత్త సత్తెమ్మ అదనపు కట్నం కోసం వేధింపులతో మార్చి 31న వినోద విషం తాగింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఘటనపై కేసు నమోదైంది.

Similar News

News December 4, 2025

S-500 గురించి తెలుసా?

image

రష్యా నుంచి దిగుమతి చేసుకున్న S-400 డిఫెన్స్ సిస్టమ్ ‘ఆపరేషన్ సిందూర్’లో గేమ్ ఛేంజర్‌గా మారింది. దీంతో దాని కంటే శక్తిమంతమైన S-500ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. S-400 సిస్టమ్ 400కి.మీ దూరంలోని టార్గెట్లను మాత్రమే షూట్ చేయగలదు. కానీ S-500 రేంజ్ 600 కి.మీ కావడం విశేషం. హైపర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, లో ఆర్బిట్ శాటిలైట్లను నాశనం చేయగలదు. ఒక్క యూనిట్ ధర సుమారు రూ.20,800కోట్ల వరకు ఉంటుంది.

News December 4, 2025

కామారెడ్డి: 3వ విడత తొలి రోజు నామినేషన్లు ఎన్నంటే?

image

కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ డివిజన్ పరిధిలోని బాన్సువాడ, డోంగ్లి, మద్నూర్, జుక్కల్, నస్రుల్లాబాద్, బీర్కూర్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్ మండలాల్లో 3వ విడత ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు దాఖలైన నామినేషన్లను అధికారులు వెల్లడించారు.168 సర్పంచ్ స్థానాలకు 128 నామినేషన్లు రాగా, 1,482 వార్డు స్థానాలకు 148 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రేపటి వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది.

News December 4, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి భద్రకాళి దేవస్థానంలో గురువారం మార్గశిర మాసం పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.