News April 10, 2025
మెదక్: వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్

శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండలం మన్నెవారి జలాల్పూర్ గ్రామానికి చెందిన వినోద(34)కు కొంతాన్ పల్లి గ్రామానికి చెందిన చెల్లి ప్రవీణ్ కుమార్‌తో వివాహమైంది. భర్త ప్రవీణ్, అత్త సత్తెమ్మ అదనపు కట్నం కోసం వేధింపులతో మార్చి 31న వినోద విషం తాగింది. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News April 23, 2025
కామారెడ్డి: సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన వరుణ్ రెడ్డి

టీజీఎన్‌పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ ఎండీ వరుణ్ రెడ్డి బుధవారం కామారెడ్డి జిల్లాలోని సిరిసిల్ల రోడ్ వద్ద 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సబ్‌స్టేషన్‌లో సాంకేతికత అభివృద్ధిపై సూచనలు చేశారు. కలెక్టరేట్‌లో ఇంజినీర్లు, అకౌంట్స్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News April 23, 2025
ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

పహల్‌గామ్‌లో టూరిస్టులపై నిన్న ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ దేశస్థుడు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ఉగ్రదాడిని ప్రపంచంలోని చాలా దేశాలు ఖండించాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు.
News April 23, 2025
లింగంపేట్: దరఖాస్తులను క్యాటగరీ వారీగా నమోదు చేయాలని: కలెక్టర్

లింగంపేట్ మండలంలో నిర్వహిస్తున్న రైతు సదస్సుల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను క్యాటగరీల వారీగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం లింగంపేట్ తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తుల నమోదు తీరును పరిశీలించారు. ఇప్పటి వరకు 10 గ్రామాల్లో సదస్సులు నిర్వహించి 1080 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఈ దరఖాస్తులపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.