News March 21, 2025
మెదక్: విద్యార్థులకు అన్ని వసతులు: కలెక్టర్

పది పరీక్షలు జరిగే ప్రదేశాలలో 163 BNSS సెక్షన్ ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు 68 కేంద్రాలలో 10,388 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ 3, సిట్టింగ్ స్క్వాడ్లు 17, చీఫ్ సూపరింటెండెంట్ 68, డిపార్ట్మెంటల్ అధికారులు 70, మంది 590 ఇన్విజిలేటర్లను నియమించామన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులతో ఏర్పాట్లు చేశామన్నారు.
Similar News
News March 22, 2025
మెదక్: జిల్లాలో రెండో రోజు టెన్త్ పరీక్షలు ప్రశాంతం

పదో తరగతి పరీక్షలు మెదక్ జిల్లాలో రెండవ రోజు ప్రశాంతంగా జరిగాయి. మెదక్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకుల కళాశాల, పాఠశాల ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని శనివారం కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. జిల్లాలో మొత్తం 10,384 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 10,364 మంది విద్యార్థులు హాజరయ్యారు. 20 మంది విద్యార్థులు 99.80 % గైర్హాజరయ్యారు.
News March 22, 2025
మెదక్: ఏప్రిల్ 7 నుంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం

ఏప్రిల్ 7 నుంచి 15వ తేదీ వరకు టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నట్లు డీఈవో రాధా కిషన్ తెలిపారు. మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన టీచర్లకు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండల కేంద్రంలోని సెయింట్ ఆర్నాల్డ్ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం ఉంటుందని పేర్కొన్నారు. మూల్యాంకనం విధులకు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని డీఈవో సూచించారు.
News March 22, 2025
మెదక్ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు

మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని కౌడిపల్లి 38.1, హవేళిఘనపూర్ 37.7, వెల్దుర్తి 37.6, మెదక్ 37.5, అల్లాదుర్గ్ 37.3, శివ్వంపేట 37.2, రేగోడ్, పాపన్నపేట 37.1, చేగుంట 36.9 కుల్చారం, చిన్న శంకరంపేట 36.8, పెద్ద శంకరంపేట, మనోహరాబాద్ 36.5 °C గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.