News April 2, 2025
మెదక్: విద్యుదాఘాతంతో కార్మికుడి మృతి

మనోహరాబాద్(M) కొండాపూర్ పారిశ్రామికవాడలో శ్రీహన్ పాలిమర్ కంపెనీలో మధ్యప్రదేశ్(S) అనుపూరు జిల్లా బలియా గ్రామానికి చెందిన రఘునాథ్ సింగ్(21) అనే కార్మికుడు మృతిచెందాడు. మంగళవారం ఉదయం విధులు నిర్వహిస్తుండగా మిషన్‌కు చెందిన వైర్ తగలడంతో షాక్‌కు గురై చనిపోయాడు. యజమాని నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మృతుడి సోదరుడు ఆరోపించాడు. మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 4, 2025
నిజాంపేట: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్లపూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ రహమాన్ బైక్‌పై వెళ్తూ రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పను ఎక్కించి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.
News April 4, 2025
తూప్రాన్: ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో అవార్డు

తూప్రాన్ మున్సిపాలిటీకి ప్రాపర్టీ టాక్స్ వసూళ్లలో లక్ష్యాన్ని సాధించినందుకు బెస్ట్ అప్రిసియేషన్ అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాదులో సీడీఎంఏ అధికారి చేతుల మీదుగా బెస్ట్ అప్రిసియేషన్ అవార్డును కమిషనర్ పాతూరి గణేష్ రెడ్డి అందుకున్నారు. 2024-25 సంవత్సరానికి 82.17% ప్రాపర్టీ టాక్స్ వసూలు చేశారు. అవార్డు లభించినందుకు మేనేజర్ రఘువరన్, వార్డు అధికారులు, సిబ్బందిని అభినందించారు.
News April 4, 2025
మోడల్ సోలార్ గ్రామాన్ని గుర్తించండి: కలెక్టర్

ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజనతో మోడల్ సోలార్ గ్రామాన్ని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్‌లో రెడ్కో జిల్లా మేనేజర్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, ఎల్‌డిఎం నరసింహమూర్తి, ఎస్సీ ట్రాన్స్‌కో శంకర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 5వేల జనాభా గల గ్రామాన్ని ఎంపిక చేయాలన్నారు.