News March 7, 2025
మెదక్: విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పీఎం విశ్వకర్మ పథకంపై అధికారులు, అమలు కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కులవృత్తిదారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రారంభించిందన్నారు. టైలరింగ్, బార్బర్, భవన నిర్మాణ వృత్తుల్లో ఉన్నవారికి ఈ పథకం ఫలాలు అందాలన్నారు.
Similar News
News December 17, 2025
మెదక్: ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. నీలిమ పిలుపునిచ్చారు. న్యాయమూర్తులతో కలిసి ఆమె మాట్లాడారు. ఎక్కువ సంఖ్యలో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించేలా చొరవ చూపాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్ ద్వారా గరిష్ఠ స్థాయిలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
News December 17, 2025
నర్సాపూర్ ఎమ్మెల్యే స్వగ్రామంలో కాంగ్రెస్ విజయం

శివంపేట మండలంలో గోమారం సర్పంచిగా కుమ్మరి హిమవతి ఆంజనేయులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి హిమవతి సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, గోమారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వగ్రామం.
News December 17, 2025
మెదక్: మండలాల వారీగా పోలింగ్ శాతం

మెదక్ జిల్లాలో మూడో విడత 7 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా 90.68 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. ఒంటిగంట తర్వాత నమోదైన ఓటింగ్ శాతం.. చిలపిచెడు మండలంలో 90.02, కౌడిపల్లి 90.80, కుల్చారం 89.20, మాసాయిపేట 88.90, నర్సాపూర్ 93.38, శివంపేట 92.57, వెల్దుర్తి 87.62 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.


