News March 9, 2025

మెదక్: విషాదం.. మామ, కోడలు మృతి

image

మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేట గ్రామంలో ఒకేరోజు మామ, కోడలు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మక్కరాజుపేటకు చెందిన ఆరేళ్ల సుమలత (35) వారం రోజుల క్రితం అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి మామ పోచయ్య (65) తీసుకువెళ్తున్నాడు. మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం జరగగా పోచయ్య గాయపడ్డాడు. చికిత్స పొందుతున్న పోచయ్య ఈరోజు మృతిచెందగా, అస్వస్థతకు గురైన కోడలు సైతం మృతి చెందింది.

Similar News

News March 25, 2025

మేడ్చల్: బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని SUICIDE

image

క్రికెట్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని ఓ వ్యక్తి HYDలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మండల పరిధిలోని గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేశ్ (29) క్రికెట్ బెట్టింగ్‌లో రూ.2 లక్షలు పోగొట్టుకొని మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం గౌడవెల్లి పరిధిలో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 25, 2025

క్యాన్సర్ బాధితుడి మాటలకు మంత్రి శ్రీధర్ బాబు కన్నీళ్లు

image

పలిమెల మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన నితిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ HYDలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంత్రి శ్రీధర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి తానున్నానని భరోసా కల్పించారు. ‘సార్.. నేను మంచి క్రికెటర్ కావాలనుకున్నా, క్రికెట్ కిట్ ఇప్పించండి’ అని నితిన్‌ అనడంతో శ్రీధర్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. క్రికెట్ కిట్ తెప్పించి అతడి కోరికను తీర్చారు.

News March 25, 2025

‘NGKL జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలి’

image

NGKL తెలంగాణ స్కిల్ అకాడమీ అండ్ ట్రైనింగ్ (T SAT ) ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డిని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారకొండ వెంకటేశ్, జిల్లా నేతలు కాటిక రామస్వామి, ప్రజా గాయకుడు వేపూరి సోమన్న కలిశారు. యువతకు, విద్యార్థులకు నైపుణ్యాలను పెంపొందించడంపై ఇచ్చే శిక్షణలో జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. టీశాట్ ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లా యువతకు తగిన ప్రాధాన్యత ఇస్తానని అన్నారు.

error: Content is protected !!