News June 12, 2024
మెదక్: వేర్వేరుగా కరెంటు షాక్తో ఇద్దరు మృతి

మెదక్ జిల్లాలో కరెంట్ షాక్తో ఇద్దరు మరణించారు. మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన వి.నగేష్(40) వ్యవసాయ పొలం వద్ద  స్తంభానికి ఉన్న సపోర్ట్ వైరు పట్టుకోవడంతో షాక్కు గురై మృతిచెందాడు.
దీని విద్యుత్ అధికారులే నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబీకులు గ్రామంలో ధర్నా చేశారు. అలాగే మెదక్లోని గాంధీనగర్లో గుట్ట కిందిపల్లికి  చెందిన చింతల నర్సింలు మైక్ వైర్లు సరిచేస్తుండగా షాక్ కొట్టి చనిపోయాడు.
Similar News
News October 31, 2025
నర్సాపూర్ అర్బన్ పార్కులో రేపు కాటేజీలు ప్రారంభం

మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని రూ. 20 కోట్లతో ఏర్పాటు చేసిన నర్సాపూర్ అర్బన్ పార్కులో నిర్మించిన కాటేజీలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఈ కాటేజీలను శనివారం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి పాల్గొంటారు. ఈ ప్రారంభంతో సందర్శకుల రద్దీ, రాత్రి బస చేసే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
News October 30, 2025
మెదక్: రైతులకి ఇబ్బందులు లేకుండా చర్యలు: కలెక్టర్

ప్రతి సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, రైతులకి ఇబ్బందులు కలగకుండా యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు జరగాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం హవేలి ఘనపూర్ మండలం శాలిపేట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలులో ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 10,530 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు.
News October 30, 2025
ఏసీబీకి పట్టుబడ్డ మెదక్ ట్రాన్స్కో డీఈ

మెదక్ ట్రాన్స్ కో డివిజనల్ ఇంజినీర్ షేక్ షరీఫ్ చాంద్ బాషా ఏసీబీకి పట్టుబడ్డాడు. రూ.21 వేల నగదు తీసుకుంటుండగా ఉమ్మడి మెదక్ జిల్లా డీఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం పట్టుకున్నారు. ఓ పని విషయంలో నగదు తీసుకుంటూ పట్టు బడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏసీబీ అధికారులు రావడంతో మెదక్ ట్రాన్స్కో కార్యాలయంలో సిబ్బంది లేకుండా పోయారు.


