News June 12, 2024

మెదక్: వేర్వేరుగా కరెంటు షాక్‌తో ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లాలో కరెంట్ షాక్‌తో ఇద్దరు మరణించారు. మెదక్ మండలం పేరూరు గ్రామానికి చెందిన వి.నగేష్(40) వ్యవసాయ పొలం వద్ద స్తంభానికి ఉన్న సపోర్ట్ వైరు పట్టుకోవడంతో షాక్‌కు గురై మృతిచెందాడు.
దీని విద్యుత్ అధికారులే నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబీకులు గ్రామంలో ధర్నా చేశారు. అలాగే మెదక్‌లోని గాంధీనగర్‌లో గుట్ట కిందిపల్లికి చెందిన చింతల నర్సింలు మైక్ వైర్లు సరిచేస్తుండగా షాక్ కొట్టి చనిపోయాడు.

Similar News

News March 18, 2025

మెదక్: టెన్త్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి

image

మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల పరిశీలన అధికారిగా ఉషారాణి నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని వయోజన విద్యా శాఖలో డైరెక్టర్‌గా పని చేస్తున్న ఉషారాణిని నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని DEO వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు జిల్లాలోని పరీక్ష కేంద్రాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు.

News March 18, 2025

మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు

image

మెదక్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. హవేళిఘనపూర్, మెదక్,  పాపన్నపేటలో 40.3డిగ్రీలు, నర్సాపూర్, టేక్మాల్ 40‌.2, వెల్దుర్తి 39.9, కుల్చారం 39.8, నిజాంపేట్ 39.7, చిన్నశంకరంపేట 39.6, శివ్వంపేట 39.1, చిలపిచెడ్, చేగుంట 39.0, మాసాయిపేట 38.8, రేగోడ్ 38.7, కౌడిపల్లి 38.4, పెద్దశంకరంపేట 38.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 18, 2025

మెదక్: ఎండిపోతున్న వరి.. రైతుల ఆందోళన

image

మెదక్ జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో జిల్లాలో చాలాచోట్ల వరిపంటలు ఎండిపోతున్నాయి. నీరందక చేగుంట మండలం పొలంపల్లిలో వరి ఎండిపోతుంది. దీనికి తోడు ఎండలు సైతం ముదరడంతో వరి పంటపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్రామంలో దాదాపు 20 ఎకరాల వరి బీటలు బారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

error: Content is protected !!