News February 11, 2025

మెదక్: వేర్వేరుగా నలుగురి ఆత్మహత్య

image

వేర్వేరుగా నలుగురు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు.. మెదక్ జిల్లా కౌడిపల్లిలో సర్సింలు(38) అప్పులు తీర్చలేక చెరువులో దూకి మృతి చెందగా, చేగుంటలో అనారోగ్యంతో వృద్ధుడు బాలయ్య(79) చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మనోహరబాద్‌లో ఛత్తీస్ గఢ్ కూలీ రాహుల్ (25) చెట్టుకు ఉరేసుకుని, చిలిపిచేడ్‌లో మంజీరాలో దూకి రమేష్(38) ఆత్మహత్య చేసుకున్నాడు. వీరి మృతితో చెందటంతో వారి కుటుంబాలలో విషాదం నెలకొంది.

Similar News

News February 12, 2025

ఢిల్లీలో అంతర్జాతీయ సదస్సులో మెదక్ కలెక్టర్ 

image

ఢిల్లీలో జరిగిన తదుపరి తరం పరిపాలనా సంస్కరణల అంతర్జాతీయ సదస్సుకు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హాజరయ్యారు. జిల్లా కలెక్టర్‌గా మూడు జిల్లాల్లో పనిచేసిన పాలనాపరమైన అనుభవాలను దేశ, విదేశీ ప్రతినిధులతో పంచుకున్నారు. మంగళవారం ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్, భారత ప్రభుత్వ ఆధీనంలోని పరిపాలనా సంస్కరణల విభాగం సంయుక్తంగా సదస్సు నిర్వహించారు.

News February 11, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పకడ్బందీ ఏర్పాట్లు: అదనపు కలెక్టర్

image

పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి (ఎమ్మెల్సీ) ఎన్నికల కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు.మంగళవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో మెదక్, నిజామాబాద్ అదిలాబాద్ , కరీంనగర్ గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన పిఓలు, ఏపిఓలు, సెక్టార్, నోడల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.

News February 11, 2025

మెదక్: శవం వద్ద మెడికల్ విద్యార్థుల ప్రమాణం

image

మెదక్ ప్రభుత్వ వైద్య కళాశాల మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రాక్టికల్స్‌కి ముందు వారికి విజ్ఞానాన్ని పంచే శవం వద్ద ప్రమాణం చేశారు. ఎల్లప్పుడు గౌరవాన్ని, విఘ్నతను కలిగి ఉంటామని కృతజ్ఞులమై ఉంటామని వైద్య విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రకుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రవిశంకర్, డాక్టర్ జయ, అనాటమీ విభాగం డాక్టర్ అర్చన తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!