News April 15, 2025
మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. వివరాలు.. సంగారెడ్డి ఓఆర్ఆర్ పై టెంపో వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్ మాదయ్య మృతి చెందాడు. కొల్లూరులో బైక్‌ను టిప్పర్ ఢీకొట్టడంతో ప్రభాకర్ మృతి చెందగా, పుల్‌కల్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో అల్లాదుర్గం(M)కు చెందిన జర్నయ్య బైక్ పై వస్తూ లారీని ఢీకొట్టి మృతి చెందాడు. కొండపాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లా వాసి అనిల్ మృతి చెందాడు.
Similar News
News April 16, 2025
కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకులు ఎడారి: హరీశ్ రావు

వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీళ్ల కోసం ప్రజల ఘోష పడాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పొలాలు తడారిపోతున్నాయని.. ప్రజల బతుకులు ఎడారి అయిపోతున్నాయని ఆవేదన చెందారు.
News April 16, 2025
మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ

మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ అయ్యారు. మెదక్ జిల్లాకు కొత్త న్యాయమూర్తిగా జగిత్యాల జిల్లా నుంచి నీలిమ రానున్నారు. ఇక్కడి నుంచి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయ్యారు. లక్ష్మి శారదా ఇక్కడ 2022 జూన్ 2 నుంచి పనిచేస్తున్నారు. లక్ష్మి శారదా హయాంలో 2వ అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన, కొత్త కోర్టులు మంజూరు చేయించారు.
News April 16, 2025
రామాయంపేటలో వడదెబ్బతో వృద్ధుడి మృతి

వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రామాయంపేట పట్టణానికి చెందిన ఎరుకల బాలయ్య(82) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం కూడా పనికి వెళ్లారు. తిరిగి వచ్చిన ఆయన నీరసంగా ఉందని ఇంట్లోనే ఉన్నాడు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.