News January 30, 2025
మెదక్: వేసవి విద్యుత్ ప్రణాళికపై చీఫ్ ఇంజినీర్ సమీక్ష

వేసవి విద్యుత్ ప్రణాళికపై రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి మెదక్ సర్కిల్ ఆఫీసులో సమీక్షించారు. వేసవిలో ప్రతి ఒక్కరూ ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు, పరిశ్రమలకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది. ఈ వేసవి సీజన్‌లో విద్యుత్ డిమాండ్ 15 శాతం వరకు పెరుగుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. అందుకు తగ్గట్లు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నట్లు తెలిపారు. డిమాండ్ మేరకు చేసే ఏర్పాట్లపై చర్చించారు.
Similar News
News February 8, 2025
మెదక్: నేడు పాఠశాలలకు పనిదినం: డీఈవో

మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు నేడు (శనివారం) పని చేస్తాయని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించినందుకు, శనివారం పాఠశాలలు యథావిధిగా పని చేస్తాయని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులు తరగతులకు గైర్హాజరు కాకుండా చూడాలని సూచించారు.
News February 8, 2025
మెదక్: పక్కడ్బందీగా ప్రత్యేక తరగతులు: డీఈవో

మెదక్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు పక్కడ్బందీగా నిర్వహించాలని డీఈవో రాధా కిషన్ ఆదేశించారు. ఉదయం 8:15 నుంచి 9:15 వరకు, సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పారు. సాయంత్రం అల్పాహారం అందించాలని పేర్కొన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News February 8, 2025
మెదక్: కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తి అరెస్టు

భార్య, బామ్మార్దిని కత్తితో పొడిచి పారిపోయిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు రేగోడ్ ఎస్ఐ పోచయ్య తెలిపారు. రేగోడ్‌కు చెందిన ద్యారంగుల వెంకయ్య ఈ నెల 3న భార్యతో గోడవపడ్డాడు. ఈ ఘటనలో భార్య నాగమణి, బావ మరిది గురువయ్యను వెంకయ్య కత్తితో పొడిచి పారిపోయాడు. గాయపడిన ఇద్దరిని సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు వెంకయ్యను శుక్రవారం అరెస్టు చేసి రిమండ్ తరలించిన పోలీసులు తెలిపారు.