News February 19, 2025
మెదక్: వైద్యం చేయించలేక భర్తను చంపేసింది

భర్తను అల్లుడితో కలిసి భార్య హత్యచేసింది. పోలీసుల వివరాలిలా.. మెదక్ జిల్లా పాపన్నపేట మం. బాచారం వాసి ఆశయ్య(45) ఈనెల 15న పొలంలో పనిచేస్తూ పడటంతో తీవ్రంగా గాయపడ్డారు. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను ఆస్పత్రికి వెళ్తే భారీగా ఖర్చు అవుతుందని భావించిన భార్య శివమ్మ, అల్లుడు రమేశ్ కలిసి ఆదివారం అర్ధరాత్రి హత్య చేసింది. సహజమరణంగా నమ్మించే ప్రయత్నించగా మెడపై గాయలు చూసిన మృతుడి సోదరి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News September 15, 2025
సిరిసిల్ల కలెక్టరేట్లో వృద్ధుడి ఆత్మహత్యాయత్నం

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన అజ్మీరా విఠల్ సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కొడుకు, కోడలు తనను పోషించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు.
News September 15, 2025
సిరాజ్కు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు

భారత స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్కు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (ఆగస్టు) అవార్డు దక్కింది. ఇటీవల ఇంగ్లండ్తో చివరి టెస్టులో సిరాజ్ అద్భుతమైన స్పెల్ వేశారు. 9 వికెట్లు తీసి సిరీస్ 2-2తో సమం కావడంలో కీలకపాత్ర పోషించారు. ఆ సిరీస్లో ప్రతి మ్యాచ్ ఆడిన సిరాజ్.. మొత్తం 23 వికెట్లు పడగొట్టారు.
News September 15, 2025
సమయపాలన, క్రమశిక్షణ పాటించాలి: ఎస్పీ వకుల్

పోలీస్ సిబ్బందిలో క్రమశిక్షణ, సమయపాలన, జవాబుదారీతనం పెంపొందించేందుకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో రోల్ కాల్ నిర్వహించాలని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. సోమవారం ఆయన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది. ప్రతి పోలీస్ సిబ్బంది చక్కని యూనిఫామ్ ధరించి, సమయపాలన పాటించాలని, ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వకంగా మెలగాలని ఎస్పీ సూచించారు.