News March 21, 2025
మెదక్: వైద్య సేవల బలోపేతానికి ప్రణాళిక: మంత్రి

ప్రభుత్వ హాస్పిటళ్లలో అధునాతన సౌకర్యాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. ఆసుపత్రులలో వైద్య సేవల బలోపేతానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్య ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు నమ్మకం కలిగేలా బ్రాండింగ్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.
Similar News
News October 26, 2025
‘TET నుంచి మినహాయింపు ఇవ్వాలి’

సీనియర్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మెదక్ కేవల్ కిషన్ భవన్లో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న 5 డిఏలను వెంటనే ప్రకటించాలని, పిఆర్సి 2023 జూలై నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పద్మారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
News October 26, 2025
మెదక్: రేపు లక్కీగా వైన్స్ దక్కేదెవరికి..?

మెదక్ జిల్లాలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈనెల 27న మెదక్ పట్టణంలోని శ్రీవెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో డ్రా నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించారు. మద్యం పాలసీ 2025-27కు జిల్లాలోని మొత్తం 49 మద్యం షాపులకు 1,420 దరఖాస్తులు రాగా రూ.42.60 కోట్ల ఆదాయం వచ్చిందని అన్నారు. లక్కీ డ్రాలో ఎవరికి దక్కుతుందో చూడాలి.
News October 26, 2025
31న మెదక్లో బ్యాడ్మింటన్ టోర్నమెంట్: DSP

పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 31న మెదక్ పట్టణంలోని పీఎన్ఆర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ డబుల్స్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు. ఇది ‘ఓపెన్ టు ఆల్’ టోర్నమెంట్ అని, 30న సాయంత్రం 5 గంటలలోగా ఆర్ఎస్ఐ నరేష్(87126 57954) వద్ద పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు, ఏఎస్పీ మహేందర్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.


