News April 9, 2024

మెదక్: శ్రీరామనవమి వేడుకలకు రఘునందన్ రావు‌కు ఆహ్వానం

image

రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలకు బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఆహ్వాన పత్రిక అందించారు. ఈనెల 17న నిర్వహించనున్న శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు రఘునందన్ రావు‌ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Similar News

News April 16, 2026

మెదక్: ఫీజు రాయితీలకు సర్టిఫికెట్లు కీలకం: కలెక్టర్

image

పదో తరగతి విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఫీజు రాయితీలలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలో 241 మంది విద్యార్థులకు క్యాస్ట్, ఇన్‌కమ్, బర్త్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

News April 14, 2026

మెదక్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ విడుదల

image

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ వారోత్సవాల లక్ష్యమన్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి జి.వేణు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.