News February 5, 2025
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటలో 71,622 మంది ఓటర్లు

ఉమ్మడి MDK- KNR-NZB-ADB పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఓటరు జాబితాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 71,622 పట్టభద్రులు, ఉపాధ్యాయు ఓటర్లు ఉండగా 174 పోలింగ్ కేంద్రాలు గుర్తించారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 31 వరకు ఓటు వేసేందుకు మరో అవకాశం కల్పించగా ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. తుది ఓటరు జాబితాను ఈనెల 7న ప్రకటించనున్నారు.
Similar News
News February 12, 2025
సర్కారు బడిలో సార్ బిడ్డ..!

సర్కారు బడి బలోపేతం కోసం మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు ఈ టీచర్. గరిడేపల్లి మండలం కీతవారిగూడెంకి చెందిన నర్సింగ్ నరేశ్ పాలకీడు ZPHS తెలుగు టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె నర్సింగ్ నేహాను కీతవారిగూడెం ZPHSలో చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో టీచర్‌ల కాంప్లెక్స్ మీటింగ్ కీతవారిగూడెంలో నిర్వహించగా ఈ విషయం తెలియడంతో HM సువర్ణ, టీచర్లు నరేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
News February 12, 2025
వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణం

TG: వనపర్తిలో ఐటీ టవర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి(మ) నాగవరం శివారులో రెండెకరాల్లో టవర్లు నిర్మించనున్నారు. ఇందుకోసం రూ.22 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తున్నట్లు ఐటీ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
News February 12, 2025
చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు జలవనరుల శాఖ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అన్నారు. జిల్లాలో జలవనరుల శాఖ, జీవనోపాదులుపై అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో జలవనరుల లభ్యత అధికంగా ఉన్నాయన్నారు. వాటిని సరైన రీతిలో పరిరక్షించుకోవడం వలన జలవనరులు పెరిగి, అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.