News November 9, 2024
మెదక్: సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే షురూ: జిల్లా కలెక్టర్
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహణలో భాగంగా అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే కొరకు జారీ చేసిన పుస్తకంలో మొత్తం 56 అంశాలున్నాయని ఎలాంటి అనుమానాలు, సందేహాలకు తావు లేకుండా ప్రజల నుంచి ఖచ్చితమైన సమాచారం సేకరణతో నమోదు చేయాలని సూచించారు. కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 14, 2024
ఏడుపాయలలో రేపు పల్లకీ సేవ, లక్ష దీపారాధన
మెదక్ జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గాభవాని మాత క్షేత్రంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు పల్లకి సేవ, లక్ష దీపారాధన, గంగా హారతి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
News November 13, 2024
సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి
వరిధాన్యం కొనుగోలు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలని, సామాజిక, ఆర్థిక, కుల గణనను పూర్తి చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనూచౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.
News November 13, 2024
మెదక్: భార్య డెలివరీ.. యాక్సిడెంట్లో భర్త మృతి
మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కూచారం గ్రామానికి చెందిన మజ్జతి విజయ్(30) మృతి చెందాడు. సోమవారం అతడి భార్య మౌనిక తూప్రాన్ ఆసుపత్రిలో ప్రసవమైంది. గ్రామానికి చెందిన బోయిని ప్రేమ్ చంద్తో కలిసి బైక్ పై వెళ్లి బిడ్డను తిరిగి వస్తుండగా డీసీఎం ఢీకొని విజయ్ మృతి చెందాడు. భార్య డెలివరీ అయి ఆసుపత్రిలో ఉండగా.. అదే ఆసుపత్రి మార్చురీకి భర్త మృతదేహం వెళ్లడం విషాదకరం.