News February 8, 2025
మెదక్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!

మెదక్ జిల్లాలోని 21 మండలాల్లో 320 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన యువ అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు.
Similar News
News December 9, 2025
మెదక్: సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు

సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా చుక్క రాములు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర 5వ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కోశాధికారిగా రాములు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అనేక కార్మిక అంశాలపై తీర్మానాలు చేశారు. నూతన కార్యవర్గానికి మెదక్ జిల్లా కార్యదర్శి మల్లేశం అభినందనలు తెలిపారు.
News December 9, 2025
శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డీవీ శ్రీనివాస రావు హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలు మొదటి విడతలో రేగోడ్, హవేలి ఘణపూర్, టేక్మాల్, అల్లాదుర్గ్, పాపన్నపేట్, పెద్దశంకరంపేట్ మండలాల్లో 11న జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పోలింగ్ కేంద్రాలు సీసీ కెమెరాల నిఘాలో ఉంటాయని తెలిపారు.
News December 9, 2025
MDK: ఎన్నికల అధికారి కారు, ఆటో ఢీ.. మహిళ మృతి

నార్సింగి మండలం వల్లూరు శివారులోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక ఇన్నోవా కారు ఆటోను ఢీ కొట్టడంతో జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేస్తున్న ఓ మహిళకు తాకింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆటోను ఢీ కొట్టిన ఇన్నోవా కారు నిర్మల్ ఎన్నికల అబ్జర్వర్దిగా తెలుస్తుంది.


