News January 16, 2025
మెదక్: సర్వేను పక్కగా నిర్వహించాలి: కలెక్టర్

రామాయంపేట మండలం కాట్రియల్ గ్రామంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, కొత్త రేషన్ కార్డుల సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు పంచాయతీ సెక్రటరీ ధనలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 27, 2026
నర్సాపూర్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్‌లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తహశీల్దార్ శ్రీనివాస్, అధికారులున్నారు.
News February 27, 2026
మెదక్: నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రాక

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల సమీక్షా సమావేశానికి రాష్ట్ర కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హాజరుకానున్నారు. ఈ మేరకు డీబీఎఫ్ (DBF) అధ్యక్షుడు దుబాసి సంజీవ్ తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని అంబేడ్కర్ యువజన సంఘాలు, దళిత ప్రజా సంఘాల నాయకులు, అట్రాసిటీ బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.
News February 27, 2026
తూప్రాన్: విద్యుదాఘాతంతో యువరైతు మృతి

తూప్రాన్ మండలం మల్కాపూర్ వద్ద విద్యుదాఘాతంతో యువరైతు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతు కొంతం మణికాంత్(23) గురువారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద విద్యుత్తు సరఫరాను పరిశీలిస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో మణికాంత్ అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు


