News February 5, 2025
మెదక్: సీఎంను సన్మానించిన మంత్రి

ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని సీఎం వెల్లడించారు. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News October 24, 2025
మెదక్ జిల్లాలో 1420 మద్యం దరఖాస్తులు

మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాల కోసం 1420 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా పోతంశెట్టిపల్లి దుకాణానికి 54 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం సమయం పొడిగించడంతో 33 దరఖాస్తులు పెరిగాయి. మెదక్ సర్కిల్లో 17 దుకాణాలకు 513, నర్సాపూర్ సర్కిల్లో 17 దుకాణాలకు 519, రామాయంపేట సర్కిల్లో 15 దుకాణాలకు 388 దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వానికి రూ.42.60 కోట్ల ఆదాయం చేకూరింది.
News October 24, 2025
మెదక్: పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసినట్లు ఉమ్మడి మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 13 లోపు స్కూల్ HMలకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14లోపు ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు డీఈవోలకు అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News October 23, 2025
RMPT: అజంతా ఎక్స్ ప్రెస్లో సాంకేతిక లోపం

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట రైల్వే స్టేషన్లో రెండు గంటలుగా రైలు నిలిచిపోయింది. సికింద్రాబాద్ నుంచి షిరిడి వెళ్తున్న అజంతా ఎక్స్ ప్రెస్ రైలు ఇంజన్ సాంకేతిక లోపం రావడంతో నిలిపివేశారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. రైలుకు వేరే ఇంజను బిగించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.


