News February 5, 2025
మెదక్: సీఎంను సన్మానించిన మంత్రి

ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సీఎంను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు అమలు కోసం ఏకసభ్య కమిషన్ వేశామని సీఎం వెల్లడించారు. ఎందరో ముఖ్యమంత్రులకు రాని అవకాశం నాకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Similar News
News February 14, 2025
రేషన్ కార్డులపై అయోమయంలో ప్రజలు !

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన నూతన రేషన్ కార్డుల జారీ పథకంలో భాగంగా ప్రజలు అయోమయంలో పడ్డారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంచుకొని ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేసి నాలుగు పథకాలను అమలు చేశారు. రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలు అందజేశారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మీ సేవలో అప్లై చేసుకోవాలనడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు.
News February 14, 2025
మెదక్: MLC బరిలో 71 మంది..

ఉమ్మడి MDK, KNR, NZB. ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో 71 మంది నిలిచారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
News February 14, 2025
వాలంటైన్స్ డే.. మన రాజనర్సింహ లవ్ స్టోరీ

FEB 14 ప్రేమికులకు ఎంతో ప్రత్యేకం. అలాంటి ప్రేమకు సెలబ్రిటీలు, ప్రజలే కాదు.. మన రాజకీయ నాయకులూ బందీలే. మంత్రి, ఆందోల్ MLA దామోదర రాజనర్సింహ, పద్మినీరెడ్డి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఇంజినీరింగ్ చదువుతున్న రోజుల్లో నిజామాబాద్‌లో మిత్రుడి పెళ్లికి వెళ్లి అక్కడ పద్మినీతో తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. స్నేహితుల సహాయంతో 1985లో ఇద్దరూ పెళ్లి చేసుకోగా ఇరు కుటుంబాల పెద్దలు ఆశీర్వదించారు.