News December 25, 2024

మెదక్: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్..

image

మెదక్ జిల్లాలో బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్‌కు హెలికాప్టర్‌లో వస్తారు. అనంతరం వనదుర్గమాతను దర్శించుకుని పూజలో పాల్గొంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, 11:45కి మెదక్ చర్చికి వెళ్తారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఎస్పీ కార్యాలయం వద్ద గల హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్ వెళ్తారు.

Similar News

News January 25, 2025

MDK: తగ్గిన ఎయిర్టెల్ సిగ్నల్ 

image

ఎయిర్టెల్ సిమ్ము వినియోగదారులకు గత కొన్ని రోజుల నుంచి సిగ్నల్ సరిగా అందకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ మేరకు మెదక్ జిల్లా వ్యాప్తంగా వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ఎయిర్టెల్ సిగ్నల్ సరిగా లేకపోవడం వల్ల గ్రామాల్లో ఉండే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటర్నెట్ ఆన్ చేస్తే ఒక సైట్ ఓపెన్ కావడానికి 1 నిమిషం వరకు పడుతోందని యువకులు అంటున్నారు. airtel సిబ్బంది స్పందించలన్నారు.

News January 25, 2025

మెదక్: తగ్గిన కోడిగుడ్ల ధరలు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు అధికంగా తగ్గాయి. గతంలో రూ.7.50గా పలికిన ఒక్క కోడి గుడ్డు ధర నేడు రూ.5.50లకు పడిపోయింది. ఒక ట్రే రూ.180 ఉండేది. రేట్లు తగ్గడంతో రూ.150కు ట్రే అమ్ముతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గుడ్లపై మక్కువ ఉన్న ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

News January 25, 2025

జాతీయ ఓటరు దినోత్సవాన్ని జయప్రదం చేయండి: కలెక్టర్

image

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ నుంచి స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ అవగాహన ర్యాలీలో జిల్లా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, ఆర్డీఓలు, సహాయ ఎన్నికల అధికారులు, తహశీల్దార్లు, జర్నలిస్టులు, ప్రజలు, విద్యార్థుల అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు.