News June 20, 2024

మెదక్: సైబర్ వలలో ప్రభుత్వ టీచర్.. రూ.75వేలు స్వాహా

image

తూప్రాన్‌లో సైబర్ నేరగాళ్ల వలలో పడి ఓ ప్రభుత్వ టీచర్ డబ్బులు పోగొట్టుకున్నాడు. టీచర్ మనీష్ రెడ్డి ఆన్లైన్‌లో క్రెడిట్ కార్డు ద్వారా వివేకానంద వాల్ పోస్టర్ బుక్ చేశారు. అయితే ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఉపాధ్యాయుడి ఖాతాలో ఉన్న రూ.75 వేలను మూడు విడతలుగా కాజేశారు. సైబర్ మోసాన్ని గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 14, 2025

MDK: మహిళపై లైంగిక దాడి, హత్య.. జీవిత ఖైదు

image

మెదక్ పట్టణంలో 2020లో జరిగిన మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయమూర్తి నీలిమ సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడైన ఫకీరానాయక్‌కు జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. కల్లు దుకాణం వద్ద పరిచయం పెంచుకుని, పొలానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

News October 13, 2025

మెదక్: బాణాసంచ విక్రయాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక టపాకాయల (బాణాసంచా) దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు ముందస్తుగా అనుమతి పొందడం తప్పనిసరి అని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. వ్యాపారులు తమ దరఖాస్తులను సంబంధిత సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. మార్గదర్శకాల కోసం కూడా సబ్ డివిజన్ పోలీస్ అధికారిని సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.

News October 12, 2025

మెదక్: సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

image

ప్రజలు సైబర్ నేరాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. లోన్ యాప్‌లు, జాబ్ ఫ్రాడ్‌లు, ఏపీకే ఫైల్స్‌తో డాటా చోరీ, క్రిప్టో కరెన్సీ పెట్టుబడి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సైబర్ మోసాలకు గురైతే తక్షణమే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని ఎస్పీ కోరారు.