News February 20, 2025

మెదక్: స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

కేంద్రీయ విద్యాలయం నిర్మాణం చేపట్టడానికి అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు. బుధవారం హవేలీ ఘనపూర్ మండల కేంద్రంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహశీల్దార్ సింధు రేణుకతో కలిసి కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.

Similar News

News February 22, 2025

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా ఎంపిక

image

కృత్రిమ మేధా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార్యక్రమంలో పైలెట్ ప్రాజెక్టుగా మెదక్ జిల్లా ఎంపికైంది. మొత్తం 6 పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన వాటిలో మెదక్‌తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నారాయణపేట, మేడ్చల్, భూపాలపల్లి ఉన్నాయి. ప్రాథమిక స్థాయిలో అభ్యసనా సామర్థ్యాలు పెంపుకై పిల్లలు చదవడం, రాయడం సంబంధించి పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఈ ల్యాబ్‌లో కృత్రిమ మేధా సాఫ్ట్ వేర్ పొందుపరుస్తారు.

News February 22, 2025

రామాయంపేటలో చిరుత సంచారం.. ఆందోళనలో రైతులు

image

రామాయంపేట శివారులోని జాతీయ రహదారి సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న 1421 సర్వే నంబర్‌లోని వ్యవసాయ పొలం వద్ద గత రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఉదయం లేగదూడను చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.

News February 22, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు, పోలింగ్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేయాలన్నారు. పోలింగ్ ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా ఉండాలన్నారు.

error: Content is protected !!