News March 14, 2025

మెదక్: హోళీ వేడుకలలో అదనపు కలెక్టర్

image

మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని సూచించారు. హోలీ పండుగ ఐక్యతకు చిహ్నమని, జాతీయ సమైక్యతా భావంతో దేశంలో జరుపుకునే సంబరాల్లో హోలీ ఒకటన్నారు.

Similar News

News January 4, 2026

నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలపై రేపు హరీశ్ రావు PPT

image

“నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు” అనే అంశంపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్(PPT) ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. నదీ జలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను, జరుగుతున్న నష్టాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News January 4, 2026

మెదక్: ‘ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలి’

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ తెలిపారు. శనివారం రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి.సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం నుంచి రాహుల్ రాజ్, ఆర్డీవో మైపాల్ రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.

News January 3, 2026

నర్సాపూర్‌లో టెట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

నర్సాపూర్ బీవీఆర్‌ఐటీ కళాశాలలోని టెట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం సందర్శించారు. జిల్లాలో 200 మంది అభ్యర్థులకు గాను 95 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. మొదటి పేపర్‌కు 65 మంది, రెండో పేపర్‌కు 40 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.