News March 14, 2025

మెదక్: హోళీ వేడుకలలో అదనపు కలెక్టర్

image

మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండగ తెలంగాణ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. జిల్లా ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఘనంగా జరుపుకోవాలని సూచించారు. హోలీ పండుగ ఐక్యతకు చిహ్నమని, జాతీయ సమైక్యతా భావంతో దేశంలో జరుపుకునే సంబరాల్లో హోలీ ఒకటన్నారు.

Similar News

News April 21, 2025

BREAKING: తూప్రాన్: ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి 

image

మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్విని(5)తో హల్దీ వాగులో దూకింది. గమనించిన స్థానికులు ఆమెను బయటకు లాగగా పిల్లలు గల్లంతయ్యారు. మమత భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు తూప్రాన్ ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

BREAKING: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గేట్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. కారులో చిన్నారులతో సహా 9 మంది ఉండగా ఏడాది బాబు గౌస్, ఆలీ (45), అజీం బేగం(40) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 21, 2025

రామాయంపేట: బట్టల వ్యాపారి మిస్సింగ్.. కేసు నమోదు

image

బట్టల వ్యాపారం చేయడానికి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. UPకి చెందిన బాబుల్ సింగ్(23 కొంతకాలంగా రామాయంపేటలో నివాసం ఉంటున్నాడు. ఈనెల 18న బోడ్మట్‌పల్లిలో బట్టల వ్యాపారం కోసం వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అతని బావ గజేందర్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!