News February 12, 2026
మెదక్: 10,000 ఏళ్ల నాటి రాతి చిత్రాలు లభ్యం

కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు మచ్చ ప్రణయ్ కుమార్ పరిశోధనలో కొల్చారం మండలం కిస్టాపూర్‌లో 10,000 ఏళ్ల మధ్య రాతియుగం (మెసోలిథిక్) నాటి చిత్రాలు బయటపడ్డాయి. ఎరుపు రంగులో ఉన్న పెద్ద కొమ్ముల ఎనుబోతుల చిత్రాలు, సూక్ష్మ రాతి పనిముట్లు, ఆయుధాలు, నూరుకున్న గుంటలను ఇక్కడ గుర్తించారు. ఇవి గుండ్ల పోచంపల్లి చిత్రాలను పోలి ఉన్నాయని, పదివేల ఏళ్ల నాటి మానవ ఆవాసాలకు ఇవి సాక్ష్యాలని చరిత్రకారులు వెల్లడించారు.
Similar News
News March 13, 2026
ఆల్కహాల్ తాగితే నిద్ర పడుతుందా?.. డాక్టర్లు ఏమన్నారంటే!

మద్యం తాగితే త్వరగా నిద్ర పడుతుందని చాలామంది భావిస్తారు. కానీ అది ఒక పెద్ద భ్రమ అంటున్నారు వైద్యులు. ‘ఆల్కహాల్ వల్ల గాఢ నిద్ర తగ్గి, రాత్రివేళ తరచూ మెలకువ వస్తుంది. దీంతో మెదడుకు విశ్రాంతి ఉండదు. గురక & స్లీప్ అప్నియా వంటి శ్వాసకోశ సమస్యలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ఉదయం లేవగానే నీరసంగా, అలసటగా ఉంటుంది. కాబట్టి మంచి నిద్ర కోసం మద్యానికి దూరంగా ఉండటమే బెటర్’ అని సూచిస్తున్నారు. SHARE IT
News March 13, 2026
తిరుపతిలో 16న జాబ్ మేళా.. 650 జాబ్స్

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయం మోడల్ కెరీర్ సెంటర్ (MCC)లో 16వ తేదీ ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. 6 కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లమా, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. దాదాపు 650 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 13, 2026
గ్యాస్ దెబ్బ.. పెరిగిన టిఫిన్ల ధరలు!

ఎల్పీజీ కొరత సాకుగా చూపి హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో హోటళ్లు టిఫిన్ల ధరలు పెంచినట్లు తెలుస్తోంది. ప్రతి ఐటమ్‌పై ప్లేట్‌కు రూ.10 పెంచినట్లు వినియోగదారులు చెబుతున్నారు. అయితే ఇది తాత్కాలిక పెంపు మాత్రమేనని యాజమాన్యాలు అంటున్నాయి. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్లు దొరకడం లేదని, ఇటీవల LPG ధర కూడా పెరగడంతో నిర్వహణ ఖర్చులు ఎక్కువైనట్లు పేర్కొంటున్నాయి. మరి మీ ఏరియాలోనూ టిఫిన్ల ధరలు పెరిగాయా? COMMENT


