News February 12, 2025
మెదక్: 21 జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739263537248_50139766-normal-WIFI.webp)
మెదక్ జిల్లాలో 21 మండలాల్లో జడ్పీటీసీ, 190 ఎంపీటీసీ స్థానాలున్నాయి. ఈనెల 15న ఓటర్ లిస్ట్ డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయనున్నారు. జిల్లాలో పురుషులు 2,52,279 మంది, మహిళలు 2,71,878 మంది, ఇతరులు 9 మంది మొత్తం 5,23,966 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల కోసం 70 కేంద్రాల్లో 91 మంది ఆర్ఓలు, జడ్పీటీసీ ఎన్నికల కోసం 21+4 రిటర్నింగ్ అధికారులుగా జిల్లా అధికారులను నియమించారు.
Similar News
News February 13, 2025
రాయపోల్: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి.. గ్రామస్థుల ఆందోళన
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739370546825_52001903-normal-WIFI.webp)
రాయపోల్ మండలం అంకిరెడ్డిపల్లి వద్ద రోడ్డు దాటుతున్న ఆటో డ్రైవర్ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. వీర నగర్కు చెందిన ఆటో డ్రైవర్ జాలిగామ ఐలయ్య ఈరోజు సాయంత్రం సిమెంట్ కోసం అంకిరెడ్డిపల్లి వద్దకు వచ్చి ఆటోను నిలిపి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. నిందితుడిని పట్టుకోవాలని గ్రామస్థులు గజ్వేల్ చేగుంట రహదారిపై ఆందోళన చేపట్టారు.
News February 12, 2025
సిద్దిపేట: త్వరలో మాజీమంత్రి హరీశ్ రావు పాదయాత్ర
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739343306306_50605465-normal-WIFI.webp)
సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. ఆ ప్రాజెక్టుల నిర్దేశిత ఆయకట్టు ప్రాంతాల్లో వారం రోజులు 130 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో రోజుకో సభ.. చివరి రోజు సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
News February 12, 2025
తూప్రాన్: చెరువులో పడి 6ఏళ్ల చిన్నారి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739355388253_52001903-normal-WIFI.webp)
తూప్రాన్ పెద్ద చెరువులో పడి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన చాంద్ పాషా, పర్వీన్ కుమార్తె జుబేరియా(6) బుధవారం ఉదయం తల్లితో కలిసి పెద్ద చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి బట్టలు ఉతుకుతుండగా మెట్లపై ఆడుకుంటున్న జుబేరియా ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.