News September 1, 2024
మెదక్: BRAOU డిగ్రీ అడ్మిషన్ల గడువు పెంపు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. హుస్సేన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అడ్మిషన్ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, కళాశాలలోని అభ్యాసక కేంద్ర కో ఆర్డినేటర్ తిరుమల రెడ్డిని సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 17, 2025
నర్సాపూర్: ‘బాల్య వివాహాలపై సమాచారం ఇవ్వండి’

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి హెచ్చరించారు. బాల్య వివాహాలపై ఆదివారం నర్సాపూర్లో ఫంక్షన్ హాల్ యజమానులు, ఫోటోగ్రాఫర్లు, పురోహితులు, బ్యాండ్ బాజా వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మైనర్ బాలబాలికలకు వివాహాలు జరిగితే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వివాహాలు చేసే ముందు వారి వయసు వివరాలను తప్పనిసరిగా సేకరించాలని తెలిపారు.
News November 16, 2025
కుటుంబానికి మూలశక్తి స్త్రీ: సత్యవాణి

భారతీయ కుటుంబానికి మూలశక్తి స్త్రీయే అని సామాజిక ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి అన్నారు. రామాయంపేట శిశు మందిర్లో సప్తశక్తి సంగం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడలేని కుటుంబ వ్యవస్థ కేవలం మన భారతదేశంలోనే ఉందన్నారు. కుటుంబ బాధ్యతను అత్యంత సమర్థంగా నిర్వహించే శక్తి మహిళకే ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో మహిళ పాత్రే అత్యంత కీలకమన్నారు.
News November 16, 2025
రేపటి నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్: డీఎంఓ నాగరాజు

మెదక్ జిల్లాలో జిన్నింగ్(పత్తి) మిల్లుల బంద్ కారణంగా సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. కావున సమస్య పరిష్కారం అయ్యేవరకు రైతులు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దని జిల్లా మార్కెటింగ్ అధికారి కే.నాగరాజు సూచించారు. సీసీఐ వారు జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో L1, L2 పద్ధతిని అనుసరించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగినట్లు ఆయన తెలిపారు.


