News February 2, 2025
మెదక్: BRS శ్రేణుల్లో పుల్ జోష్.. నింపిన KCR ప్రసంగం

జహీరాబాద్ నియోజక వర్గం నుంచి రైతులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా కేసీఆర్ మాటలు కార్యకర్తలలో జోష్‌ను నింపాయి. కేసీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆయా ప్రాజెక్టులను మరుగున పడేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ అవసరమైతే ఉద్యమించి పోరాటం చేస్తానని తెలిపారు. ఉద్యమంలో తాను ముందుండి నడిపిస్తానన్నారు.
Similar News
News February 26, 2026
మన్యం: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆర్మీ జవాన్ మృతి

గరుగుబిల్లి మండలం గిజబ గ్రామ సమీపంలో ప్రధాన రహదారి వద్ద గురువారం ఉదయం గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి దవలసింగి చంద్రమౌళి (29)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 26, 2026
HYD: ఫోన్ రిపేర్, ఐటీఐ, ల్యాండ్ సర్వేలో ఫ్రీ కోర్సు

ముస్లింలు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీవర్గాలకు చెందిన 18- 35 ఏళ్ల యువత నుంచి ఉచిత శిక్షణ కోర్సులకు FEB 25- మార్చి 3 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపారు. ల్యాండ్ సర్వేయర్, ఎంఈపీ టెక్నీషియన్ (ఇంటర్/ఐటీఐ/డిప్లొమా), స్మార్ట్‌ఫోన్ రిపేర్ (టెన్త్) కోర్సులకు 3 నెలల శిక్షణ ఇస్తారు. ఆధార్, విద్యార్హత సర్టిఫికెట్‌లు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరం.
News February 26, 2026
HYD: విద్యార్థులకు టెలి మనస్ సేవలు

TGBIE ఆధ్వర్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. పరీక్షల్లో ఒత్తిడి, భయం, నిరుత్సాహాన్ని ఎదుర్కొనే విద్యార్థులు మౌనం వహించకుండా తమ సమస్యలను పంచుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడు నిపుణుల సహాయం పొందడం తప్పు కాదని పేర్కొన్నారు. మానసిక సహాయం కోసం టెలీ మానస్ హెల్ప్‌లైన్ 14416లో సంప్రదించాలని BIE ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ వెల్లడించారు.


