News July 19, 2024

మెదక్: EMT ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

EMR గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20న EMT ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ జనార్ధన్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు 20 నుంచి 35 సంవత్సరాల వయసు గలవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News November 10, 2025

మెదక్: ‘ఆరు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు’

image

సంచార పశువైద్యశాలలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలకు 2017 సంవత్సరంలో పశు సంచార వైద్యశాలను అందించారు. ఇందులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్, హెల్పర్లకు గత ఆరు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం వచ్చిన వెంటనే పశువులకు సేవలందిస్తున్న తమకు వేతనాలు రాక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News November 10, 2025

ఏడుపాయల అమ్మవారి సన్నిధిలో దీపోత్సవం

image

ఏడుపాయల వన దుర్గ మాత సన్నిధిలో కార్తీక సోమవారం పురస్కరించుకొని సాయంకాల ప్రదోషకాల వేళలో దీపాలంకరణ సేవ నిర్వహించారు. అర్చకులు పార్థీవ శర్మ ఆధ్వర్యంలో పూజల అనంతరం మంటపంలో అమ్మవారి ఆకారంలో దీపాలు వెలిగించారు. అనంతరం మంజీరాలో గంగాహారతి ఇచ్చారు. ఆకాశ దీపం వెలిగించారు. భక్తులు పాల్గొని అమ్మవారి నామస్మరణ మారుమ్రోగించారు.

News November 10, 2025

మెదక్: ప్రజావాణి కార్యక్రమంలో 75 దరఖాస్తులు

image

మెదక్ కలెక్టరెట్‌లోని ప్రజావాణిలో మొత్తం 75 దరఖాస్తులు స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. వీటిల్లో భూ సమస్యలకు సంబంధించి 34, పింఛన్లకు సంబంధించి 14, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 05, దరఖాస్తులు వచ్చాయన్నారు. మిగిలిన 26 దరఖాస్తులు ఇతర సమస్యలకు సంబంధించినవని పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.