News January 30, 2025
మెదక్: GREAT.. జాతీయ స్థాయికి ఐదోసారి ఎంపిక

కౌడిపల్లి మండలంలోని మహమ్మద్ నగర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ గౌడ్ కొల్చారం మండలంలో AEO గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. ఆయన మాట్లాడుతూ 5వ సారి జాతీయ స్థాయికి ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నాయకులు, గ్రామస్థులు అభినందించారు.
Similar News
News February 18, 2025
మెదక్: రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

11వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ బాయ్స్, గర్ల్స్ ఛాంపియన్షిప్ పోటీలకు హవేలి ఘనపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని హెచ్ఎం కరుణాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాఠశాలకు చెందిన నవీన్, ప్రకాష్ సింగ్, రోహిత్ గౌడ్‌లు రన్నింగ్, షాట్ ఫుట్ విభాగాల్లో ఎంపికయ్యారని అన్నారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నేడు మంగళవారం జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను అభినందించారు.
News February 17, 2025
మెదక్: రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు

నూతనంగా నియామకమైన పోలీస్ సిబ్బందికి రెండవ బ్యాచ్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలలో పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు.
News February 17, 2025
మెదక్: ప్రజల సమస్యలను పరిష్కరించాలి: ఎస్పీ

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పి డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు త్వరగా పరిశీలించాలని సూచించారు.