News February 27, 2025
మెదక్: MLC ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

మెదక్ జిల్లాలో జరగబోయే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Similar News
News February 27, 2025
సిద్దిపేట: వివాహేతర సంబంధం.. మహిళ హత్య

అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. గజ్వేల్ ACP పురుషోత్తం రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. అనంతగిరిపల్లికి చెందిన యాదమ్మ(40) భర్త చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన చిన్నలక్ష్మయ్యతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టింది. దీంతో ఈనెల 15న కోమటిబండ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కల్లులో పురుగు మందు కలిపి తాగించాడు. అనంతరం చీరతో ఉరేశాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
News February 27, 2025
మెదక్: అన్ని పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి: DEO

మెదక్ జిల్లాలోని అన్ని బోర్డు స్కూల్స్ (సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ)లో 2025-26 గాను 1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం ఆదేశించిందని డీఈవో రాధాకృష్ణ తెలిపారు. ద్వితీయ భాష- సింగిడి, తృతీయ భాష- వెన్నెల పుస్తకాలు బోధించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమన్యాలు దీనిని అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 27, 2025
ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.