News March 6, 2025
మెదక్: MLC కౌంటింగ్.. 60 గంటలు సాగింది

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందిన సంగతి తెలిసిందే. కాగా కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా సాగింది. ఈనెల 3న ఉ. 8 గంటలకు చెల్లుబాటయ్యే ఓట్లు, చెల్లుబాటు కాని ఓట్లను వేరు చేయడం మెుదలు పెట్టగా మంగళవారం ఉ. 10 గంటల వరకు ఈ ప్రక్రియ సాగింది. 11 గంటలకు అభ్యర్థులకు పోలైన ఫస్ట్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు స్టార్ట్ చేయగా బుధవారం 8 గంటలకు అంటే సుమారు 60 గంటల వరకు సాగింది.
Similar News
News December 6, 2025
మెదక్: చివరి రోజు 521 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో చివరి రోజు 521 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-54, కౌడిపల్లి-101, కుల్చారం-69, మాసాయిపేట-33, నర్సాపూర్-92, శివంపేట-106, వెల్దుర్తి-66 చొప్పున మూడు రోజులై కలిపి 1028 నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు మొత్తం 3528 నామినేషన్లు దాఖలు అయ్యాయి.
News December 6, 2025
మెదక్: నేడు రెండో విడత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

మెదక్ జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలలో పోటీ చేసే అభ్యర్థులకు నేడు గుర్తులు కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా, అనంతరం తెలుగు అక్షరమాల పద్ధతిలో అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. మెదక్, చిన్న శంకరంపేట, రామాయంపేట, నిజాంపేట తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండలాలలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.
News December 6, 2025
ఉమ్మడి మెదక్ జిల్లాలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో కోహీర్ 10.0, మెదక్ జిల్లాలో పెద్ద నర్లాపూర్11.2, సిద్దిపేట జిల్లాలో అంగడి కిష్టాపూర్ 10.6 °C అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


